: ప్రారంభమైన ఆంధ్రా ఎమ్మెల్యేల ట్రైనింగ్ క్లాసులు
హైదరాబాదులోని గ్రాండ్ కాకతీయ హోటల్లో ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలకు శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తదితరులు హాజరయ్యారు. కార్యక్రమ ప్రారంభంలో అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ, ఎన్నికల్లో విజయం పట్ల శాసనసభ్యులకు అభినందనలు తెలిపారు. సభలో ఎలా మాట్లాడాలి, సమస్యలపై ఎలా చర్చించాలి, సభా మర్యాదలు వంటి విషయాలపై ఈ వర్క్ షాపు ద్వారా ఎమ్మెల్యేలు అవగాహన పెంచుకోవచ్చని కోడెల అన్నారు. చట్ట సభల్లో సభ్యుల ప్రవర్తనను ప్రజలందరూ గమనిస్తున్నారని, అందుకే హుందాగా మెలగాల్సిన అవసరం ఉందనీ అన్నారు. ఎవరైనా మాట్లాడేటప్పుడు అడ్డుతగలకుండా, సభ సజావుగా నడిచేందుకు సహకరించాలని సూచించారు. సభలో ఒక్క నిమిషానికి రూ.8 లక్షలు ఖర్చవుతోందని, కాబట్టి, సభా సమయం ఎంత విలువైనదో అర్థం చేసుకోవాలని ఆయన హితవు పలికారు.