: సబిత విషయమై సోనియాతో చర్చించిన ఆజాద్
విదేశీ పర్యటనను ముగించుకుని వచ్చిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి మరోసారి ఆంధ్రప్రదేశ్ సమస్యలు స్వాగతం పలికాయి. కేంద్రమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి గులాంనబీ ఆజాద్ ఈ ఉదయం అధినేత్రితో సమావేశమయ్యారు. దాదాపు అర్ధగంటపాటు జరిగిన ఈ భేటీలో ప్రధానంగా జగన్ అక్రమాస్తుల కేసులోని ఐదవ అభియోగ పత్రంలో సబితా ఇంద్రారెడ్డిని ఏ4గా సీబీఐ పేర్కొనడం పైనే చర్చించారు. ఇక తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల వలసలపైనా ఆజాద్ సోనియాకు వివరించారు. ఈ క్రమంలో టీఎంపీలను రెండురోజుల్లో ఢిల్లీకి పిలిచి సోనియా చర్చిస్తారని సమాచారం.