: స్టార్ హోటల్లో ఆంధ్రా ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులు
ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలకు నేటి నుంచి హైదరాబాదులోని గ్రాండ్ కాకతీయ హోటల్లో శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి లోక్ సభ స్పీకర్ సుమిత్ర మహాజన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు తదితరులు హాజరుకానున్నారు. ఈ శిక్షణ తరగతులు రేపటితో ముగుస్తాయి. అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ స్వాగతోపన్యాసంతో కార్యక్రమం ప్రారంభమవుతుంది.