: ఢిల్లీ, కోల్ కతా నగరాల్లో కుండపోత వర్షం
ఢిల్లీ నగరంలో కుండపోతగా వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ నిలిచిపోయింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. కోల్ కతా నగరంలో ఇవాళ సాయంత్రం భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో రోడ్లపై భారీగా నీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఆఫీసు నుంచి ఇంటికెళ్లే ఉద్యోగులు వర్షంతో ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడంతో ద్విచక్ర వాహనాలు నీటిలో మునిగిపోయాయి.