: ఆభరణాల ప్రదర్శనలో అదరగొట్టిన బాలీవుడ్ భామలు
ముంబయిలో జరిగిన ఇండియా ఇంటర్నేషనల్ జ్యూయలరీ వీక్ - 2014 లో బాలీవుడ్ ముద్దుగుమ్మలు పాల్గొన్నారు. ఈ ప్రదర్శనలో ప్రముఖ డిజైనర్లు రూపొందించిన ఆభరణాలను ధరించిన బాలీవుడ్ భామలు ర్యాంపుపై హొయలొలికించారు. అందాల నటి శ్రీదేవి ఈ ప్రదర్శనలో బంగారు నగలను ధరించి చిరునవ్వులు చిందించారు. సోనమ్ కపూర్, యామీ గౌతమ్, పరిణీతి చోప్రా వీక్షకుల మతి పోగొట్టారు. ఆద్యంతం వేడుకగా ఈ ప్రదర్శన సాగింది.