: చంద్రబాబును పరామర్శించిన కల్యాణ్ రామ్
విశాఖజిల్లా నాతవరం మండలం శృంగవరంలో విశ్రాంతి తీసుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని నటుడు నందమూరి కల్యాణ్ రామ్ కలిశారు. బాబు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తీవ్ర కాలినొప్పి కారణంగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యబృందం సూచించడంతో రెండురోజుల పాటు పాదయాత్రను బాబు నిలిపివేసిన సంగతి తెలిసిందే.