: ఏ కార్యక్రమం చేపట్టినా ప.గో.జిల్లాకు అధిక ప్రాధాన్యం: చంద్రబాబు
తన పాలనలో పశ్చిమగోదావరి జిల్లాకు అధిక ప్రాధాన్యం ఇస్తానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంలో పశ్చిమగోదావరి జిల్లా కీలకపాత్ర పోషించిందని ఆయన అన్నారు. శాసనసభ ఎన్నికల్లో టీడీపీ ఈ జిల్లాలో క్లీన్ స్వీప్ చేసిందని ఆయన గుర్తు చేశారు. మునిసిపాలిటీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఇక్కడి ప్రజలు టీడీపీకి ఘనవిజయం అందించారన్నారు. టీడీపీ పట్ల పశ్చిమగోదావరి జిల్లా వాసులు చూపిన ఆదరణకు... తాను ఈ ఐదేళ్లలో రుణం తీర్చుకుంటానని ఆయన అన్నారు.