: అఫ్జల్ ఉరిపై విశ్లేషణలు


అఫ్జల్ ఉరిని ఒక్కొకరు ఒక్కో రకంగా విశ్లేషిస్తున్నారు. కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళుతుందని కొందరు భావిస్తున్నారు. వచ్చే సెప్టెంబర్, అక్టోబర్లో వెళ్ళవచ్చని అంచనా వేస్తున్నారు. అందుకే రెండు నెలల క్రితం అజ్మల్ కసబ్, ఇప్పుడు అఫ్జల్ కు ఉరి శిక్ష అమలు చేసారని అంటున్నారు.

మరో విశ్లేషణ ప్రకారం, ఈ నెలలో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ప్రతిపక్షాలను దీటుగా ఎదుర్కోవడానికే తాజాగా అఫ్జల్ ను ఉరి తీసారని అంటున్నారు. దీని ద్వారా బీజేపీ 'హిందుత్వ' నినాదానికి గండి కొట్టాలనే లక్ష్యం కూడా వుందని చెబుతున్నారు. అయోధ్యలో రామాలయం నిర్మించాలని కుంభమేళా వేదికగా రెండు రోజుల క్రితం విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.

అలాగే బీజేపీ కూడా దీనికి మద్దతుగా రామాలయం నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని ప్రకటించింది. ఉగ్రవాదులను కాంగ్రెస్ రక్షిస్తోందంటూ బీజేపీ కొంత కాలంగా పదే పదే ఆరోపిస్తోంది. అఫ్జల్ ను ఉరి తీయకపోవ
డాన్ని అందుకు ఉదాహరణగా కూడా పేర్కొన్నది. ఈ పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ నోటికి తాళం వేసి, ఉగ్రవాదులను క్షమించేది లేదని చెప్పడానికే కేంద్ర సర్కారు ఈ రోజు అఫ్జల్ ను ఉరికంభం ఎక్కించిందని విశ్లేషిస్తున్నారు. 

  • Loading...

More Telugu News