: ఎనిమిదేళ్ల తర్వాత భారత మహిళా టెస్టు క్రికెట్
భారత మహిళా క్రికెట్ జట్టు త్వరలో నాలుగు రోజుల టెస్టు మ్యాచ్ ఆడబోతోంది. దాదాపు ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం ఇంగ్లాండ్ తో టెస్టు మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు ఆగస్టు 7 నుంచి ప్రారంభంకానున్న ఈ మ్యాచ్ లకు జట్టు త్వరలో ఇంగ్లండ్ వెళ్లనుంది. దాంతోపాటు మూడు వన్డే మ్యాచ్ లు కూడా ఆడనుందట. మొత్తం ఈ టూర్ పందొమ్మిది రోజులపాటు ఉండనుంది. వర్మ్ స్లే క్రికెట్ మైదానంలో ఆగస్టు 13 నుంచి 16 వరకు టెస్టు మ్యాచ్ జరుగుతుంది. అటు లార్డ్స్ మైదానంలో వన్డే ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. అంతకంటే ముందు మహిళా క్రికెట్ జట్టు రెండు ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడుతుంది.