: అక్రమ కట్టడాల కూల్చివేతకు బ్రేక్ పడింది!
అక్రమ కట్టడాల కూల్చివేతకు పుల్ స్టాప్ పడనుంది. గ్రేటర్ హైదరాబాదు కార్యాలయంలో జరిగిన జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. అక్రమ కట్టడాల కూల్చివేతను ఆపాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అక్రమ కట్టడాలను క్రమబద్ధీకరించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ప్రభుత్వానికి జీహెచ్ఎంసీ పాలక మండలి లేఖ రాయనుంది. నిర్మాణాల కోసం అనుమతులిచ్చిన అప్పటి అధికారులపై చర్యలు తీసుకోకుండా... కట్టడాలను కూల్చివేయడం తగదని పాలక మండలి అభిప్రాయపడింది.