: ధావన్ మరో'సారీ'... టీమిండియా 44/1


ఇంగ్లండ్ తో లార్డ్ మైదానంలో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు తొలి వికెట్ కొల్పోయింది. ఫాం లేమితో ఇబ్బంది పడుతున్న ఓపెనర్ శిఖర్ ధావన్ (7) మరోసారి విఫలమయ్యాడు. దీంతో భారత జట్టు ఆదిలోనే తొలివికెట్ కోల్పోయింది. సీమ్ బౌలింగ్ కు అనుకూలించే పిచ్ పై చెలరేగిన ఇంగ్లాండ్ బౌలర్లు భారత బ్యాట్స్ మన్ ను కట్టిపడేశారు. దీంతో టీమిండియా ఆటగాళ్లు స్వేచ్ఛగా బ్యాటు ఝుళిపించలేకపోయారు. 22 ఓవర్లు ఆడిన టీమిండియా ఓవర్ కు రెండు పరుగులు చొప్పున కేవలం 44 పరుగులు మాత్రమే చేయగలిగింది. మురళీ విజయ్ (24), ఛటేశ్వర్ పూజారా (10) ఆచితూచి ఆడుతున్నారు. ధావన్ (7) వికెట్ ను ఆండర్సన్ చేజిక్కించుకున్నాడు. దీంతో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ తొలి సెషనల్ లో 22 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా ఒక వికెట్ నష్టపోయి 44 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News