: బావిలో పడిన చిరుత... రక్షించిన అధికారులు
వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తున్న సంఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా, గుజరాత్ లోని పంచ్ మహల్లో ఓ చిరుత బావిలో పడిపోయింది. చిరుత అరుపులు విన్న స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో, బావి వద్దకు వచ్చిన అధికారులు ఓ తాడు సాయంతో తీవ్రంగా శ్రమించి చిరుతను రక్షించారు.