: బడ్జెట్ రూపకల్పనపై మంత్రులతో యనమల భేటీ
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ పై ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, మంత్రులతో విస్తృతస్థాయి చర్చలు కొనసాగిస్తున్నారు. ఈ రోజు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులతో ఆయన భేటీ అయ్యారు. ఎక్సైజ్, ఇంధన, రెవెన్యూ, దేవాదాయ, పంచాయతీరాజ్ శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆగస్టులో ఏపీ బడ్జెట్ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే.