: కేసీఆర్ స్థానికతపై విచారణ జరపాలి: ఎమ్మెల్సీ నాగేశ్వర్
ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలో స్థానికతను లేవనెత్తిన ముఖ్యమంత్రి కేసీఆర్ పై పలువురు నేతలు మండిపడుతున్నారు. ముందు ఆయన స్థానికతపై విచారణ జరపాలని తెలంగాణకు చెందిన ఎమ్మెల్సీ నాగేశ్వర్ అన్నారు. అటు పోలవరంపై మాట్లాడిన ఆయన, కేసీఆర్ వల్లే ముంపు ప్రాంతాలను తెలంగాణ కోల్పోయిందని ఆరోపించారు. టీఆర్ఎస్ వైఖరివల్లే ఖమ్మం ప్రజలు నష్టపోయారన్నారు. ప్రస్తుతం ముంపు ప్రాంత ప్రజలు ఏపీ ప్రభుత్వ రాయితీలకు ఆకర్షితులవుతున్నారని పేర్కొన్నారు.