: చంద్రబాబు గారూ! మమ్మల్ని ఆదుకోండి: శ్రీకాకుళం జిల్లా మత్స్యకారులు


ఫైలిన్ తుపాను సృష్టించిన విధ్వంసాన్ని తామెన్నటికీ మర్చిపోలేమని శ్రీకాకుళం జిల్లా మత్స్యకారులు అంటున్నారు. ఫైలిన్ తుపాను వచ్చి దాదాపు పదినెలలు కావస్తున్నా, తాము ఇప్పటికీ ఏమాత్రం కోలుకోలేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే దాదాపు 280 గ్రామాలు ఫైలిన్ తుపాను ధాటికి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయని వారు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా సాగర తీరం ఫైలిన్ తుపాను ప్రభావంతో దెబ్బతిన్నదని మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు. ఫైలిన్ తుపాను భీభత్సానికి తమ ఇళ్లు, పడవలు, వలలు బోట్లు... అన్నీ కోల్పోయి రోడ్డు మీద పడ్డామని వారు వెల్లడించారు. అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తమకు ఆర్థిక సహాయం చేస్తామని ప్రకటించారని... అయితే ఇప్పటివరకు తమకు అందింది నామమాత్రమేనని వారు చెబుతున్నారు. నూతన ముఖ్యమంత్రి చంద్రబాబైనా తమ జీవితాలను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.

  • Loading...

More Telugu News