: నిబంధనలు సవరించాకే లోక్ పాల్ కమిటీ నియామకం: కేంద్రం
పెండింగ్ లో ఉన్న లోక్ పాల్ కమిటీ నియామకంపై ఈ రోజు రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం లిఖిత పూర్వక సమాధానం ఇచ్చింది. సెర్చ్ కమిటీ నిబంధనలు సవరించాకే లోక్ పాల్ కు ఛైర్ పర్సన్, మిగతా సభ్యులను నియమిస్తామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఇప్పటికే సెర్చ్ కమిటీ నిబంధనల ప్రామాణికతపై సుప్రీంకోర్టులో ఓ ఎన్జీవో (స్వచ్చంద సంస్థ) రిట్ పిటిషన్ రూపంలో సవాల్ చేసిందని వెల్లడించారు. ఈ మేరకు మే 5న దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం, ఈ విషయంలో తిరిగి పరిశీలన చేసి అధికారిక సవరణలు చేయాలని ప్రభుత్వానికి చెప్పినట్లు సింగ్ పేర్కొన్నారు.