: కొండెక్కిన టమోటా ధర... కస్టమర్లకు కష్టం, రైతన్నకు లాభం
టమోటా ధరలు పెరగడంతో రైతులు ఆనందపడుతున్నారు. మొన్నటి వరకు సరైన గిట్టుబాటు ధర రాని కారణంగా తమకు నష్టాలే మిగిలాయని, ఇక ఇప్పుడు రేటు పెరగడంతో లాభాలు వస్తున్నాయంటూ టమోటా రైతులు సంతోషం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లి మార్కెట్ నుంచి జంటనగరాలకు టమోటాలు ఎక్కువగా వస్తున్నాయి. హోల్ సేల్ గా టమోటా కిలో రూ.35 వరకు ఉందని రైతులు చెప్పారు. బహిరంగ మార్కెట్లో టమోటా కిలో 60 రూపాయలకు పైగా ధర పలుకుతోంది. దీంతో, టమోటా కొనాలంటేనే వెనుకాడుతున్నామని వినియోగదారులు అంటున్నారు. రైతు బజార్లలో సైతం టమోటాల ధర ఎక్కువగా ఉంది. దీంతో కిలోకు బదులు పావుకిలో టమోటాలు కొని సరిపెట్టుకోవాల్సి వస్తుందని కస్టమర్లు వాపోయారు. టమోటా ధరలను నియంత్రించాలంటూ వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.