: రెండేళ్లలోనే ఊహించని అభివృద్ధి: చంద్రబాబు
రానున్న రెండేళ్లలోనే రాష్ట్రాన్ని ఎవరూ ఊహించని రీతిలో అభివృద్ధి చేసి చూపిస్తానని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రైతు రుణాలతో పాటు డ్వాక్రా రుణాలను కూడా మాఫీ చేస్తామని గురువారం పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో పర్యటించిన సందర్భంగా ఆయన చెప్పారు. అయితే కుటుంబానికి ఒక్క రుణ మాఫీ మాత్రమే వర్తిస్తుందన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండేందుకే జిల్లాల పర్యటన కొనసాగిస్తున్నానన్నారు. పోలవరం ముంపు బాధితులకు పూర్తిగా పునరావాసం కల్పించేేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. ఏపీలో హైదరాబాద్ ను తలదన్నేలా నాలుగు నగరాలను నిర్మిస్తామని చెప్పారు. తీర ప్రాంతాన్ని పర్యాటక పరంగా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని దేవాలయాలన్నింటిని అనుసంధానిస్తూ పర్యాటక రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తామన్నారు.