: విశాఖ బస్టాండ్ వద్ద భారీ అగ్నిప్రమాదం
విశాఖ ద్వారకానగర్ లోని ఆర్టీసీ కాంప్లెక్స్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో కాంప్లెక్స్ అంతటా మంటలు వ్యాపిస్తున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే కాంప్లెక్స్ లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొస్తున్నారు. ఎవరికీ ఎటువంటి ప్రమాదం కాలేదని సమాచారం.