: ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోలేదు: నితిన్ గడ్కరీ
ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేేసేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారంటూ వస్తున్న వార్తలపై ఆ పార్టీ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ప్రధానమంత్రి వచ్చిన తరువాతే ప్రభుత్వ ఏర్పాటుపై నిర్ణయం ఉంటుందని చెప్పారు. బీజేపీ నేతలకు పదవీకాంక్ష ఉండదన్నారు. ఏఏపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు యత్నించారన్న ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యలను గడ్కరీ ఖండించారు. బీజేపీకి అలాంటి అవసరంలేదని స్పష్టం చేశారు.