: డిప్యూటీ సీఎంకు ఐస్ క్రీమ్ ఇవ్వలేదని ఇద్దరు ఇంజినీర్లకు నోటీసులు


మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కు ఐస్ క్రీమ్ ఇవ్వలేదన్న కారణంతో ఇద్దరు ఇంజీనీర్లు తమ పై అధికారుల ఆగ్రహానికి గురయ్యారు. విషయం ఏంటంటే... పవార్ ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు జాల్నా వెళుతుండగా, మార్గమధ్యంలో ఔరంగాబాద్ లోని పీడబ్ల్యూడీ అతిథి గృహం వద్ద భోజనం కోసం ఆగారు. తిండి బాగానే పెట్టారు కానీ, ఆఖర్లో ఐస్ క్రీమ్ ఇవ్వలేదట సదరు మంత్రివర్యులకు. దీనిపై పవార్ మద్దతుదారులు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఇద్దరు పీడబ్ల్యూడీ ఇంజినీర్లకు నోటీసులు జారీ అయ్యాయి. మంత్రిగారికి ఐస్ క్రీమ్ ఎందుకివ్వలేదో సంజాయిషీ ఇవ్వాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా, తనకు ఐస్ క్రీమ్ ఇవ్వనందుకు పవార్ ఏమీ నొచ్చుకోకపోగా, మద్దతుదారులు మాత్రం చాలా ఫీలయ్యారట.

  • Loading...

More Telugu News