: మాఫీ లేటైతే ఉద్యమిస్తాం: వైఎస్ జగన్
వ్యవసాయ రుణాలతో పాటు డ్వాక్రా రుణాల మాఫీ ఆలస్యమైతే ఉద్యమించక తప్పదని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రుణమాఫీ కోసం మరో నెల రోజుల పాటు వేచి చూస్తామన్న జగన్, ఆ తర్వాత రైతులు, మహిళలతో కలిసి ఉద్యమిస్తామని చెప్పారు. పంట నష్టపోయిన రైతులకు రుణాలను రీషెడ్యూల్ చేయడం సాధారణమేనని, అదేదో తానే రీషెడ్యూల్ చేయిస్తున్నానని బాబు గొప్పలు చెప్పుకోవడం సరికాదని శ్రీకాకుళం పర్యటనలో ఉన్న జగన్ అన్నారు. అధికారంలోకి రాగానే రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు, ఇప్పటిదాకా ఈ విషయంపై స్పష్టత ఇచ్చిన పాపానపోలేదని ఆయన ఆరోపించారు.