: తండ్రి పేరిట వెబ్ సైట్ ప్రారంభించిన బాలీవుడ్ నటి
బాలీవుడ్ సీనియర్ నటి షబానా ఆజ్మీ తన తండ్రి కైఫీ ఆజ్మీ పేరిట ఓ వెబ్ సైట్ ను ప్రారంభించారు. కైఫీ ఆజ్మీ సుప్రసిద్ధ ఉర్దూ కవి. ఆయన కలం నుంచి ఎన్నో కవితలు, గేయాలు జాలు వారాయి. వీటన్నింటిని ఇప్పుడు ఆయన పేరిట లాంచ్ చేసిన ఆడియో-వీడియో వెబ్ సైట్లో పొందుపరిచారు. ఈ సైట్ ప్రారంభించామని, చూడండంటూ షబానా ట్విట్టర్ లో పేర్కొన్నారు. దీంట్లో లెజెండ్, కలెక్షన్ పేరిట రెండు విభాగాలుంటాయని తెలిపారు. లెజెండ్ విభాగంలో కైఫీ ఆజ్మీకి సంబంధించిన వివరాలు పొందుపరిచారు. కలెక్షన్ విభాగంలో గజల్స్, పాటలు, పద్యాల రూపంలో ఆయన సాహిత్యం ఉంటుంది.