: యూఏఈలో కుటుంబంతో సహా మలయాళం సినీ నిర్మాత మృతి
మలయాళం సినీ నిర్మాత సంతోష్ కుమార్, అతని భార్య మంజు, కుమార్తె గౌరి దుబాయ్ లోని వారి ఫ్లాట్ లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. రెండు రోజుల (మంగళవారం) కిందటే వారు చనిపోగా మృతదేహాలు బాగా కుళ్లిపోయినట్లు అక్కడి ఖలీజా టైమ్స్ పత్రిక పేర్కొంది. అయితే, ఇంతవరకు తమను ఎవరూ సంప్రదించలేదని కుమార్ కజిన్ ఒకరు అన్నారు. కాగా, ముగ్గురి మృతదేహాలపై పలుచోట్ల పొడిచిన గాయాలు ఉన్నట్లు సమాచారం. అయితే, దీన్ని ఆత్యహత్యగానే పరిగణిస్తున్నారు. ఈ ఘటనపై స్పందించడానికి దుబాయ్ పోలీసులు అందుబాటులో లేరు. కేరళలో సౌపర్ణికా ఫిల్మ్ అనే నిర్మాణ సంస్థను నెలకొల్పిన నిర్మాత సంతోష్ కుమార్ 2009లో దాన్ని దుబాయ్ కు షిఫ్ట్ చేశారు.