: సచిన్ తన సత్తా చూపడం లేదు: స్టీవ్ వా


అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవడానికి ఇదే సరైన తరుణమా? కాదా? అనేది సచినే నిర్ణయించుకోవాలని ప్రముఖ ఆస్ట్రేలియా వెటరన్ క్రికెటర్ స్టీవ్ వా అన్నాడు. కేరళీయుల నూతన సంవత్సర వేడుకలకు విచ్చేసిన సందర్భంగా తిరువనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడాడు. సచిన్ ఆటపై వా అభిప్రాయాన్ని రాబట్టేందుకు మీడియా ప్రతినిధులు ప్రయత్నించారు. దీనికి వా స్పందిస్తూ.. సచిన్ బాగానే ఆడుతున్నాడు.. కానీ, అతడి పూర్వపు స్థాయిలోలా ఆడలేకపోతున్నాడ'ని చెప్పాడు. రిటైర్ అవ్వాలా? వద్దా? అన్నది అతడే నిర్ణయించుకోవాలన్నాడు. ఆట ప్రమాణాలు, నాణ్యత నిలబెట్టడానికి టెస్ట్ మ్యాచులు ఎంతో ముఖ్యమైనవని అభిప్రాయం వ్యక్తం చేశాడు. సచిన్ ఇప్పటికే వన్ డే అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. ప్రస్తుతం టెస్టులలోనే కొనసాగుతున్నాడు.

  • Loading...

More Telugu News