: కింగ్ ఫిషర్... కింగ్ ఆఫ్ డీఫాల్టర్!
లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా నేతృత్వంలోని కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్... ఉద్యోగులకు సరిగా వేతనాలను కూడా చెల్లించని సంస్థగా మనకు చిరపరచితమే. అయితే తాజాగా ఆ సంస్థ మరో ఘనకీర్తిని కూడా మూటగట్టుకుంది. తీసుకున్న రుణాలను చెల్లించలేక దివాళా తీసిన ‘డీఫాల్టర్ కింగ్’ గానూ కింగ్ ఫిషర్ వినుతి కెక్కింది. బ్యాంకులకు ప్రస్తుతం ఆ సంస్థ రూ. 4 వేల కోట్ల మేర బకాయి పడిందట. ఇలా బ్యాంకుల వద్ద రుణాలు తీసుకుని పెద్ద మొత్తంలో దివాళా తీసిన కంపెనీల్లో ‘కింగ్’దే తొలి స్థానమట. ఆ తర్వాతి స్థానంలో విన్ సమ్ డైమండ్స్ అండ్ జ్యూవెలరీదట. సు-రాజ్ డైమండ్స్ గా గతంలో కార్యకలాపాలు సాగించిన ఈ సంస్థ బ్యాంకులకు రూ. 3,200 కోట్ల మేర బకాయి పడింది. ఇక ఈ జాబితాలో రూ. 2,600 కోట్ల బకాయిలతో ఎలక్ట్రో థర్మ్ ఇండియా మూడో స్థానంలో నిలిచింది. ఇలా బ్యాంకుల నుంచి అప్పనంగా రుణాలు పొంది తిరిగి చెల్లించడంలో చతికిలబడిన సంస్థలు దేశ ఆర్థికాభివృద్ధికి తీరని నష్టం చేస్తున్నాయి. ఈ నష్టాన్ని పూరించుకునేందుకు రానున్న ఐదేళ్లలో రూ. 2.40 లక్షల కోట్ల మేర నిధులను కొత్తగా సమీకరించాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు.