: మంత్రిగారి తనయుడు మహా పోకిరి..!
రాజస్థాన్ ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి హేమ్ సింగ్ భదానా తనయుడు సురేంద్ర సింగ్ మహా పోకిరి! స్నేహితులతో జులాయిగా తిరుగుతూ, మహిళలను వేధించడం అతనికి నిత్యకృత్యం. తాజాగా ఇద్దరు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించి చిక్కుల్లో పడ్డాడు. ఆల్వార్ ప్రాంతంలో ఇద్దరు మహిళలు కనిపించడంతో సురేంద్ర సింగ్ తన స్నేహితులతో కలిసి వారి వద్దకు వచ్చాడు. అసభ్యకర ప్రవర్తనతో వేధించసాగాడు. దీంతో, వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల్లో ఒకరిని అరెస్టు చేశారు. మంత్రి తనయుడు సహా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.