: ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన స్పోర్ట్స్ ఫ్రాంఛైజీ 'రియల్ మాడ్రిడ్': ఫోర్బ్స్
ప్రపంచంలో ఉన్న స్పోర్ట్స్ ఫ్రాంఛైజీలు అన్నింటిలోకి 'రియల్ మాడ్రిడ్' అత్యంత సంపన్నమైనదని ఫోర్బ్స్ మేగజీన్ వెల్లడించింది. స్పానిష్ సాకర్ క్లబ్ అయిన రియల్ మాడ్రిడ్ 3.44 బిలియన్ డాలర్ల విలువతో లిస్టులో తొలి స్థానాన్ని ఆక్రమించింది. లిస్టులో అగ్ర స్థానంలో నిలవడం రియల్ కు ఇది వరుసగా రెండో సారి. మరో సాకర్ ఫ్రాంఛైజీ 'బార్సిలోనా' 3.20 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో నిలువగా, 'మాంచెస్టర్ యునైటెడ్' 2.81 బిలియన్ డాలర్లతో మూడో స్థానాన్ని ఆక్రమించుకుంది. ప్రఖ్యాతి గాంచిన బేస్ బాల్ ఫ్రాంఛైజీ 'న్యూయార్క్ యాంకీస్' 2.5 బిలియన్ డాలర్లతో నాలుగో స్థానంలో నిలిచింది.