: ఈ నెల 20న నెల్లూరు జిల్లాపరిషత్ ఎన్నిక
ఇప్పటికి రెండు సార్లు వాయిదా పడిన నెల్లూరు జిల్లాపరిషత్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక ఈ నెల 20న జరగనుంది. 13న జరగాల్సిన ఎన్నిక కోరం లేకపోవడంతో వాయిదా పడిన సంగతి తెలిసిందే. టీడీపీ, వైకాపాలు ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో... ఈ ఎన్నిక ఉత్కంఠభరితంగా మారింది. వైకాపా జడ్పీటీసీలకు టీడీపీ గాలం వేస్తుండగా... తమ అభ్యర్థులను కాపాడుకోవడానికి వైకాపా నానా తంటాలు పడుతోంది. ఈ నేపథ్యంలో, రానున్న '20వ తేదీ' రాష్ట్రవ్యాప్తంగా హై టెన్షన్ క్రియేట్ చేయబోతోంది.