: హైదరాబాదులో భూకబ్జాలపై ఉక్కుపాదం: కేసీఆర్


హైదరాబాదు నగరంలో భూకబ్జాలకు అంతు లేకుండా పోయిందని టీ-సీఎం కేసీఆర్ అన్నారు. దేవాలయ భూములు, ప్రభుత్వ భూములు, నాలా భూములు, చెరువు భూములు.... ఇలా కనిపించిన భూమినల్లా అన్యాక్రాంతం చేశారని ఆయన చెప్పారు. హైదరాబాదులో ఒక్క అంగుళం భూమిని కూడా వదలబోమని, కబ్జాలపై ఉక్కుపాదం మోపుతామని ఆయన స్పష్టం చేశారు. నాలా భూములు కబ్జాకు గురవడంతో చిన్నపాటి వర్షానికే డ్రైనేజీలు పొంగిపొర్లి, రోడ్లను ముంచివేస్తున్నాయని ఆయన అన్నారు. రాజ్ భవన్, ముఖ్యమంత్రి కార్యాలయాల ముందు నీళ్లు నిలుస్తున్నాయంటే... పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చునని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు.

  • Loading...

More Telugu News