: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేస్తాం: కేసీఆర్


తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ఏర్పాటు చేసేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కేసీఆర్ చెప్పారు. దీనిని తక్షణమే ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ‘ఫైనాన్షియల్ అసిస్టెన్స్’ పేరుతో తెలంగాణ విద్యార్థుల కోసం కొత్త పథకాన్ని ప్రారంభించామన్నారు. 1956కి ముందు తెలంగాణలో నివాసం ఉన్న వారికే ఈ పథకాన్ని వర్తింపజేయనున్నట్లు ఆయన వెల్లడించారు. తెలంగాణలో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరిస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ వెటర్నరీ యూనివర్శిటీకి పీవీ నరసింహారావు పేరును పెట్టాలని మంత్రివర్గం నిర్ణయించిందని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News