: హైదరాబాదును విశ్వనగరంగా తీర్చిదిద్దుతాం: కేసీఆర్


బతుకమ్మ, బోనాల పండుగలను రాష్ట్ర పండుగలుగా గుర్తిస్తూ ప్రభుత్వం సాంస్కృతిక శాఖకు ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. హైదరాబాదును అంతర్జాతీయ ప్రమాణాలతో విశ్వనగరంగా తీర్చిదిద్దే విధంగా మాస్టర్ ప్లాన్ ను రూపకల్పన చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు, సంప్రదింపులు జరిపేందుకు స్టేట్ అడ్వైజరీ కౌన్సిల్ ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఈ కమిటీలో విద్యావంతులు, జర్నలిస్టులు, పత్రికాధిపతులు ఉంటారని, వారు తెలంగాణ ప్రభుత్వానికి దిశానిర్దేశం చేస్తారన్నారు. తెలంగాణ రాజముద్రలో స్వల్ప మార్పులు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.

  • Loading...

More Telugu News