: తెలంగాణ రాజముద్రలో మార్పులకు కేబినెట్ ఆమోదం
సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నాలుగు గంటలుగా కొనసాగుతోంది. ఈ సమావేశంలో 38 అంశాలకు సంబంధించి చర్చిస్తున్నట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలిచ్చే అంశంపై అధ్యయనం చేసేందుకు ఓ కమిటీని నియమించాలని కేబినెట్ నిర్ణయించింది. తెలంగాణ ఉద్యోగులకు ఇంక్రిమెంట్ ఇచ్చేందుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రూ. 180 కోట్లు ఖజానాపై భారం పడనుంది. అలాగే తెలంగాణ రాజముద్రకు స్వల్ప మార్పులు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.