: ఆర్యన్ రాజేష్ మళ్లీ తండ్రయ్యాడు
ఇవీవీ తనయుడు, సినీ నటుడు ఆర్యన్ రాజేష్ మళ్లీ తండ్రి అయ్యాడు. సంవత్సరం క్రితం బాబుకు జన్మనిచ్చిన ఆర్యన్ రాజేష్ దంపతులకు జులై 14న పాపాయి పుట్టింది. తాను మళ్లీ బాబాయ్ అయ్యానంటూ అల్లరి నరేష్ సోషల్ మీడియాలో ఫోటోను పోస్ట్ చేశారు. ఇవీవీ సత్యనారాయణ స్థాపించిన ‘ఇవీవీ సినిమా’ బ్యానరుపై ఆర్యన్ రాజేష్ సినిమాలను నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఆర్యన్ ‘బందిపోటు’ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.