: 'వన్ స్టాప్ షాప్'గా తెలంగాణ గ్రామ పంచాయతీలు: కేటీఆర్


తెలంగాణ వ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీలను ఈ-పంచాయతీలుగా మార్చేందుకు ప్రణాళికలు సిధ్దం చేశామని మంత్రి కేటీఆర్ తెలిపారు.ఈ పంచాయతీల ద్వారా ఉపాధి హామీ, పింఛన్ల చెల్లింపు, పన్ను వసూళ్లు, జనన మరణ ధృవపత్రాలు జారీ చేస్తామని ఆయన వెల్లడించారు. గ్రామస్థులు పంచాయతీ కార్యాలయానికి వస్తే... అన్ని పనులు పూర్తయ్యేలా వాటిని తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు. పంచాయతీలను మరింత పారదర్శకంగా, బాధ్యాతాయుతంగా బలోపేతం చేస్తామని ఆయన అన్నారు. మొదటి విడతలో 2,400 పంచాయతీలను ఈ-పంచాయతీలుగా మార్చాలని నిర్ణయించినట్లు తెలిపారు. బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీతో గ్రామ పంచాయతీలను అనుసంధానం చేస్తామని కేటీఆర్ ప్రకటించారు.

  • Loading...

More Telugu News