: ఏపీ కార్పొరేషన్లలో ఇక ఎల్ ఈడీ వెలుగులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లలో వీధిదీపాలకు ఎల్ ఈడీ లైట్లను అమర్చనున్నట్లు రాష్ట్ర మంత్రి నారాయణ చెప్పారు. ఎల్ ఈడీ లైట్ల వాడకం వల్ల 65 శాతం విద్యుత్ ఆదా అవుతుందని ఆయన అన్నారు. ఎల్ ఈడీ లైట్ల మెయింటెనెన్స్ ను కేంద్రమే చూసుకుంటుందని మంత్రి చెప్పారు. గృహ అవసరాలకు 10 రూపాయలకే బల్బులను అందించనున్నట్లు నారాయణ వెల్లడించారు.