: కబడ్డీ జట్టుకు సహయజమానిగా నటి సోనాక్షి సిన్హా
'వరల్డ్ కబడ్డీ లీగ్'లో పలువురు సెలబ్రిటీలు యజమానులవుతున్నారు. తాజాగా యునైటెడ్ సింగ్స్ జట్టుకు బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా సహయజమానిగా వ్యవహరించబోతోంది. ఈ జట్టు ప్రధాన యజమాని యూకేకు చెందిన 'ద హేర్ గ్రూప్'. దీనిపై సోనాక్షి మాట్లాడుతూ, వరల్డ్ కబడ్డీ లీగ్ లో భాగమైనందుకు తాను చాలా సంతోషంగా ఉన్నానని అంటోంది. ఇది తన తొలి ప్రయత్నమని, కబడ్డీ చాలా వేగవంతమైన క్రీడ అని చెప్పింది. నటుడు అక్షయ్ కుమార్, గాయకుడు హనీ సింగ్ తర్వాత మూడో సెలబ్రిటీ సోనాక్షి కావడం విశేషం.