: ఆ దొంగ... ముగ్గురు మహిళలను చంపేశాడు!
ఆ అంతర్రాష్ట్ర దొంగ ఎట్టకేలకు సూర్యాపేట పోలీసుల చేతికి చిక్కాడు. చోరీ సమయంలో అతడు ముగ్గురు మహిళలను హతమార్చినట్టు పోలీసులు తెలిపారు. నిందితుడు నేతి దయాకర్ నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం తుంగతుర్తికి చెందిన వాడని పోలీసులు చెప్పారు. దయాకర్ వివిధ రాష్ట్రాల్లో పలు దొంగతనాలకు పాల్పడ్డాడని, తన పనికి అడ్డు పడ్డ మహిళలను చంపిన ఘరానా నేరస్తుడని వారు పేర్కొన్నారు.