: షిర్డీ సాయిబాబాకు మూడు రోజుల్లో రూ.4.47 కోట్ల విరాళాలు


గురుపూర్ణిమ నేపథ్యంలో షిర్డీలోని సాయిబాబా ఆలయానికి భక్తులు భారీగా విరాళాలు సమర్పించుకున్నారు. మూడు రోజుల పాటు జరిగిన ఉత్సవాల్లో రూ.4.47 కోట్ల విరాళాలు వచ్చాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు. డొనేషన్ బాక్సులో నగదు, బంగారం, వెండి రూపంలో రూ.3.10 కోట్లు, ఆన్ లైన్ లో కోటి 46 లక్షలు వచ్చినట్లు వెల్లడించారు. గతేడాదితో పోల్చుకుంటే ఈ సంవత్సరం విరాళాలు గణనీయంగా పెరిగాయని వారు పేర్కొన్నారు. గతేడాది కన్నా ఈసారి రూ.38 లక్షలు ఆదాయం అధికంగా వచ్చినట్లు ఆయన వివరించారు.

  • Loading...

More Telugu News