: విభజన చట్టం లోపాలపై కేంద్ర హోం శాఖకు లేఖ: యనమల


రాష్ట్ర పునర్విభజన చట్టంలో చోటుచేసుకున్న లోపాలపై కేంద్ర హోం శాఖకు లేఖ రాసేందుకు నిర్ణయం తీసుకున్నామని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. ఇప్పటికే ఈ అంశంపై న్యాయ నిపుణులతో సంప్రదింపులు ముగిశాయని ఆయన బుధవారం చెప్పారు. తమ అభ్యంతరాలతో కూడిన సవరణ బిల్లును ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఆమోదింపజేసేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. కాగా, ఆగస్టు రెండో వారం నుంచి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని చెప్పిన ఆయన, సమావేశాలు 18 రోజుల పాటు కొనసాగుతాయన్నారు. మరోవైపు, ఏపీ శాసన మండలిలో 58 స్థానాలుండేలా చూడాలని కేంద్రాన్ని కోరతామన్నారు.

  • Loading...

More Telugu News