: ప్రభుత్వ ఆసుపత్రుల్లో యూజర్ చార్జీల అంశం పరిశీలిస్తున్నాం: మంత్రి కామినేని


ప్రభుత్వ ఆస్పత్రుల్లో యూజర్ చార్జీలు వసూలు చేయాలన్న అంశాన్ని పరిశీలిస్తున్నామని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ బుధవారం చెప్పారు. బడ్జెట్ రూపకల్పనలో భాగంగా ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఈ మేరకు ప్రతిపాదించారని చెప్పిన మంత్రి, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. యూజర్ చార్జీల వసూలుతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో పాటు నాణ్యమైన వైద్యం లభిస్తుందని చంద్రబాబు సర్కారు భావిస్తోంది.

  • Loading...

More Telugu News