: రుణమాఫీ పై చంద్రబాబు మాష్టర్ ప్లాన్


రుణమాఫీపై చంద్రబాబు మరో మాష్టర్ ప్లాన్ వేస్తున్నారు. రుణమాఫీపై ఆర్బీఐ చివరిలో ఏదైనా తిరకాసు పెడితే ప్లాన్ 'బి'ను అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు చంద్రబాబు. రుణమాఫీకి కావాల్సిన డబ్బుల కోసం ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి అప్పు చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి అధ్యక్షతన ఒక కమిటీ వేసి... రుణమాఫీకి కావాల్సిన వనరుల సమీకరణ బాధ్యతను చేపట్టాలని చంద్రబాబు భావిస్తున్నారని టీడీపీ వర్గాలు అంటున్నాయి. తెలుగుదేశం పార్టీలో వనరుల సమీకరణ విషయంలో దిట్టగా పేరొందారు సుజనా చౌదరి. స్టీల్, ఇన్ ఫ్రా, ఎలక్ట్రానిక్స్, పవర్ రంగాలలో ప్రముఖ పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందారు సుజనా చౌదరి.

  • Loading...

More Telugu News