: ప్రతి ఇంటికీ ఒక రుణం మాఫీ చేస్తాం: చంద్రబాబు
పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కామవరపుకోటలో రైతులతో ముఖాముఖి అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రుణాల రీషెడ్యూల్ అంశంపై ఆర్ బీఐతో ఇవాళే మాట్లాడానన్నారు. కొద్ది రోజుల్లోనే రీషెడ్యూల్ పై స్పష్టత వస్తుందని చెప్పారు. ఇక ప్రతి ఇంటికీ ఒక రుణం మాఫీ అయ్యేలా కృషి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆక్టోబర్ 2 నుంచి వృద్ధులకు వెయ్యి రూపాయల పింఛను ఇస్తామని తెలిపారు. నాలుగేళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని, జూన్ 1 నుంచి కొత్త రాజధాని ఖాతాలో పన్నులు జమవుతున్నాయని వెల్లడించారు.