: బీసీసీఐయేమీ ధనరాశులు పోగేసుకుని కూర్చోలేదు: శ్రీనివాసన్
ఐసీసీ చైర్మన్ ఎన్. శ్రీనివాసన్ మీడియాతో మాట్లాడుతూ, విమర్శకులపై మండిపడ్డారు. బీసీసీఐయేమీ ధనరాశులు పోగేసుకుని వాటిపై కూర్చోలేదని వ్యాఖ్యానించారు. బోర్డు ఆదాయాన్ని ఎప్పటికప్పుడు ఆటగాళ్ళకు, రాష్ట్రాల క్రికెట్ సంఘాలకు పంచుతున్నామని తెలిపారు. "బీసీీసీఐని ఎల్లప్పుడూ తప్పుగానే అర్థం చేసుకుంటున్నారు. బోర్డు చేసినవన్నీ గుర్తెరగకుండా మాట్లాడుతున్నారు. 2004 నుంచి భారీగా ఆదాయాన్ని ఆర్జించింది బోర్డు. 25 రాష్ట్రాల క్రికెట్ సంఘాలకు స్పాన్సర్లు, మీడియా హక్కుల ద్వారా వచ్చిన లాభాల్లో వాటాలిచ్చింది. గతంలో వందల్లో అందుకున్న రంజీ ఆటగాడు నేడు రోజుకు రూ.35,000 తీసుకుంటున్నాడంటే అదంతా బీసీసీఐ చలవే" అని శ్రీనీ పేర్కొన్నారు.