: ప్రధాన నగరాల్లో బెంబేలెత్తిస్తున్న టొమాటో ధరలు
దేశంలో కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. ముఖ్యంగా ఉల్లిపాయ తర్వాత టొమాటో ధరలు సాధారణ ప్రజానీకాన్ని వణికిస్తున్నాయి. ముఖ్యంగా ప్రధాన నగరాల్లో వీటి ధర కిలో యాభై రూపాయల వరకు ఉంది. ఈ క్రమంలో గతవారం ఢిల్లీలో టొమాటో ధర కేజీ రూ.35 ఉంటే ఈ వారం రూ.50 పలుకుతోంది. ఇక హైదరాబాదులో అయితే ధర డబుల్ అయింది. ఇరవై రూపాయల నుంచి కేజీ టొమాటో రేటు రూ.40-50 పలుకుతోంది. బెంగళూరులో గత వారం రిటైల్ ధర కిలో రూ.27 ఉండగా, ప్రస్తుతం రూ.50కు పెరిగిపోయింది. ముంబయిలో కేజీ రూ.30 నుంచి ఏకంగా రూ.60 పలుకుతోంది. అటు చెన్నైలో రూ.35 నుంచి రూ.60-70 వరకు గిరాకీ ఉంది.