: బ్రిటీష్ అధికార కార్యకలాపాల్లోనూ ట్విట్టర్ హవా


ట్విట్టర్... సాధారణ వ్యక్తులే కాదు, ప్రభుత్వాలు సైతం ఇప్పుడు విశేషంగా ఆధారపడుతున్న సోషల్ మీడియా. ప్రభుత్వ వ్యవహారాల్లో ట్విట్టర్ నూ భాగస్వామిగా చేసేందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ రంగం సిద్ధం చేస్తుండగా, బ్రిటీష్ ప్రధాని డేవిడ్ కామెరాన్ తానూ ఓ అడుగు ముందే ఉన్నానని చాటారు. తాజాగా బ్రిటన్ క్యాబినెట్ ను పునర్వ్యవస్థీకరించనున్నారు. మామూలుగా అయితే, లండన్ లోని ప్రధాని నివాసం 10, డౌనింగ్ స్ట్రీట్ లోని కార్యాలయం ఎదుట మీడియా ప్రతినిధులు పడిగాపులు కాస్తారు... పీఎంవో వెల్లడించే వివరాల కోసం. కానీ, కామెరాన్ విలక్షణ రీతిలో ప్రకటన చేశారు. నేడు క్యాబినెట్ లో మార్పులు చేర్పుల వివరాలను తన రెండు అధికారిక ట్విట్టర్ అకౌంట్ల ద్వారా ప్రకటిస్తానని తెలిపారు.

  • Loading...

More Telugu News