: ప్రయాణికుడికి గుండెపోటు... అత్యవసరంగా ల్యాండయిన ఎమిరేట్స్ విమానం
విమానంలో ప్రయాణిస్తున్న వ్యక్తికి గుండెపోటు రావడంతో, హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఎమిరేట్స్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ విమానం దుబాయ్ నుంచి బ్యాంకాక్ వెళుతోంది. ప్రయాణికుడికి విమానాశ్రయంలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.