: ప.గో. జిల్లాలో నేటి నుంచి రెండు రోజులు పర్యటించనున్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి నుంచి రెండు రోజుల పాటు పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో ఉదయం 10.30కి ఆయన ద్వారకా తిరుమల చేరుకుంటారు. అనంతరం, మధ్యాహ్నం 12 గంటలకు రైతులతో ముఖాముఖి అవుతారు. పర్యటనలో భాగంగా పలు గ్రామాల్లో చంద్రబాబు రోడ్ షో నిర్వహిస్తారు. రాత్రి 7.30 గంటలకు జంగారెడ్డిగూడెంలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు. ఈ రాత్రికి ఆయన అక్కడే బస చేస్తారు.