: నేడు తెలంగాణ కేబినెట్ భేటీ... వరాల జల్లు కురవనుందా?


తెలంగాణ కేబినెట్ సమావేశం ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు జరగనుంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న రెండో కేబినెట్ సమావేశం ఇది. ఈ సమావేశంలో ప్రజలపై వరాల జల్లు కురవనుందని విశ్వసనీయ సమాచారం. ఎన్నికల హామీలను నెరవేర్చే క్రమంలో అనేక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. రైతుల రుణమాఫీ, ఫీజు రీయింబర్స్ మెంట్, ఉద్యమకారులపై కేసుల ఎత్తివేత, ముస్లిం, ఎస్టీలకు రిజర్వేషన్, ప్రభుత్వ ఉద్యోగులకు టి.ఇంక్రిమెంటు, పింఛన్ల పెంపు తదితర 20కి పైగా అంశాలపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.

  • Loading...

More Telugu News