: శ్రీకాకుళం ఏజన్సీలో ఏనుగుల బీభత్సం... ఊరు విడిచి వెళుతున్న గ్రామస్తులు
శ్రీకాకుళం ఏజన్సీలో ఏనుగుల గుంపు హల్ చల్ చేస్తోంది. హిర మండలం బొందిగూడ గ్రామం వద్ద ఏనుగులు మకాం వేశాయి. ఈ గుంపులో దాదాపు 10 ఏనుగులు ఉన్నాయి. తోటలు, ఇళ్లపై ఈ గుంపు దాడి చేస్తోంది. ఏనుగుల దాడితో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. బొందిగూడ గ్రామస్తులు ప్రాణ భయంతో ఊరు విడిచి వెళుతున్నారు.